త్వరలో మొదలుకానున్న ‘కార్తికేయ-2’ !

త్వరలో మొదలుకానున్న ‘కార్తికేయ-2’ !

Published on Mar 6, 2018 1:45 PM IST

హీరో నిఖిల్ కెరీర్లోని హిట్ సినిమాల్లో ‘కార్తికేయ’ కూడ ఒకటి. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిఖిల్ ను మినిమమ్ గ్యారెంటీ హీరోగా మార్చేసింది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రూపొందనుంది. ఇందులో కూడ నిఖిల్, స్వాతిలు హీరో హీరోయిన్లు కావడం విశేషం.

ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మే నెల నుండి మొదలుకానున్నాయి. చందూ మొండేటి ఇప్పటికే స్క్రిప్ట్ ను సైతం సిద్ధం చేశారట. ప్రస్తుతం ‘కిరాక్ పార్టీ’ విడుదల హడావుడిలో ఉన్న నిఖిల్ టిఎన్. సంతోష్ దర్శకత్వంలో చేయాల్సి ఉన్న ‘కనితన్’ తెలుగు రీమేక్ పూర్తయ్యాక ‘కార్తికేయ-2’లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు