కార్తికేయ ’90ML’ రిలీజ్ పరిస్థితి ఏమిటి ?

Published on Dec 4, 2019 6:30 pm IST

‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ 90ML తో రేపు ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నాడని అధికారికంగా ప్రకటించి రిలీజ్ కి సన్నాహాలు కూడా చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని తెలుస్తోంది. నిన్న సెన్సార్ క్లియరెన్స్ చేయకపోవడంతో ఈ రోజు సెన్సార్ క్లియరెన్స్ పొందింది. దాంతో ఈ సినిమా రేపు కాకుండా శుక్రవారం విడుదల అవుతుందని సమాచారం.

అయితే ఈ వార్త పై చిత్రబృందం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా నేహా సోలంకి హిరోయిన్ గా కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి యర్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. నేహా సోలంకి ఈ చిత్రంలో హీరోయిన్ గా అద్భుతంగా నటించిందట. కార్తికేయకి ఆమెకు మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు చాలా కొత్తగానూ ఎంటర్టైనింగ్ గా ఉంటాయట.

సంబంధిత సమాచారం :