కార్తికేయ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోమంటున్నారు

Published on Jun 18, 2021 10:03 pm IST

హీరో కార్తికేయ ఎన్ని ఆశలతో చేసిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయింది. పాటలు, ట్రైలర్ బాగున్నా కూడ సినిమా దెబ్బకొట్టేసింది. కార్తికేయ అయితే ఈ చిత్రం మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమతో మంచి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవచ్చని ఎదురుచూశాడు. కానీ పరాజయం ఎదురైంది. అయితే సినిమాలో అతని నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఊహించినంత స్థాయిలో సినిమా ఇవ్వలేకపోయినందుకు కార్తికేయ ప్రేక్షకులకు సారీ చెబుతూ ఈసారి చేయబోయే చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందని హామీ ఇచ్చాడు.

ప్రస్తుతం ఆయన నూతన దర్శకుడు శ్రీసరిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. టి. ఆదిరెడ్డి సమర్పణలో రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కార్తికేయ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. చిత్రం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్. సగం పూర్తైన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. ప్రస్తుతం చిత్రీకరణలకు అనుమతులు రావడంతో సినిమాను రీస్టార్ట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. సినిమాను తిరిగి సెట్స్ మీదకు తీసుకెళుతున్న సందర్భంగా ఈ ఆదివారం సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకోవచ్చని నమ్మకంగా చెబుతున్నారు నిర్మాతలు. ఇందులో తాన్యా రవిచంద్రన్ కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :