పవర్ స్టార్ కి మద్దతు ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నా – హీరో కార్తికేయ

Published on Sep 26, 2021 7:04 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పై, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుక లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ మేరకు ఇప్పటికే పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల మద్దతు తెలపడం జరిగింది. ఈ మేరకు యువ నటుడు RX 100 తో తెలుగు సినిమా పరిశ్రమ కి పరిచయం అయిన గుమ్మకొండ కార్తికేయ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏ ఒక్క రాజకీయ పార్టీ కి మద్దతు ఇవ్వడం లేదు, వ్యతిరేకించడం లేదు అని అన్నారు. కానీ, తెలుగు సినిమా పరిశ్రమ కి సంబందించి పవన్ కళ్యాణ్ సార్ ప్రస్తావించిన సమస్యలు పూర్తిగా అర్దం అయ్యాయి అని అన్నారు. పరిశ్రమ లో భాగం కావడం వలన మా అందరి తరపున మాట్లాడిన పవన్ సార్ కి మద్దతు ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :