‘కథానాయకుడు’ లేటెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ !

Published on Jan 16, 2019 3:15 pm IST

ఈ ఏడాది అవైటెడ్ బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రంలోని మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకుంది.

అయినా బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ ను రాబట్టడంలో కథానాయకుడు ఫెయిల్ అయ్యాడు. మొదటి వారం పూర్తి అయ్యే సరికి కథానాయకుడు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 18.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగాడు.

ఇక బయోపిక్ టీం శనివారం నుండి ‘మహానాయకుడు’ షూటింగ్ ను కూడా మొదలుపెట్టనుంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ బయోపిక్ ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ బయోపిక్ ను నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More