నటుడికి పెను ప్రమాదం తప్పింది !

Published on Jun 26, 2021 12:00 pm IST

వివాదాస్పద వ్యక్తి కత్తి మహేశ్‌ పెను ప్రమాదం నుండి చిన్నపాటి గాయాలతో తప్పించుకున్నారు. కత్తి మహేష్ నెల్లూరు జిల్లాలో తన బంధువుల ఇంటికి వెళ్తూ ఉండగా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయింది. అతి వేగంతో వెళ్తున్న ఆయన కారు నేరుగా వెళ్లి లారీని ఢీకొట్టింది.

దాంతో కత్తి మహేశ్‌ కారుకి తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. నెల్లూరులోని మెడికేర్‌ ఆస్పత్రికి కత్తి మహేశ్‌ని తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనలో కత్తి మహేశ్‌ కారు నుజ్జు, నుజ్జు అయిందని తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదానికి కారణం పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :