చిరు 150వ సినిమాకి మరో కొత్త నిర్మాత

చిరు 150వ సినిమాకి మరో కొత్త నిర్మాత

Published on Dec 18, 2015 8:34 AM IST

chiranjeevi

గత కొద్ది నెలలుగా మెగా అభిమానులును ఎంతగానో ఊరించిన మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి రీసెంట్ గా రామ్ చరణ్ క్లారిటీ ఇవ్వడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘కత్తి’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. చిరు 150వ సినిమా అనుకున్నప్పటి నుంచీ ఆ సినిమాని రామ్ చరణ్ తన సొంత బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ పై నిర్మిస్తానని చెబుతున్నాడు. చెప్పిన దాని ప్రకారమే ఆయనే నిర్మించనున్నాడు.

కానీ తాజా సమాచారం ప్రకారం చిరు 150వ సినిమాని చరణ్ తో పాటు మరో ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా భాగస్వామ్యం కానుంది. వారే లైకా ప్రొడక్షన్స్.. వీళ్ళే తమిళ వెర్షన్ ని కూడా నిర్మించారు. ఇప్పుడు అదే సంస్థ చరణ్ తో సహా నిర్మాతలుగా కలిసి చిరు 150వ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం తెలుగు వెర్షన్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ వారు రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో ‘రోబో 2.0’ని మొదలు పెట్టారు.

తాజా వార్తలు