‘కత్రినా – విక్కీ’ రోకా ఫంక్షన్‌ అయిపోయింది !

Published on Nov 8, 2021 6:36 pm IST

హీరోయిన్ కత్రినా కైఫ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ లవ్‌ బర్డ్స్‌ త్వరలోనే పెళ్లితో ఒకటి కాబోతున్నారని గత కొన్ని రోజులుగా రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. తాజాగా వీరి ‘రోకా’ అయిపోయిందట. ఇంతకీ రోకా అంటే.. పెళ్లికి ముందు జరిగే చిన్నపాటి వేడుక. అబ్బాయి–అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు ఒకచోట కలిసి నిశ్చితార్థం డేట్ అలాగే పెళ్లి ముహూర్తం, వేదిక, విందు లాంటి అన్నీ విషయాలను మాట్లాడుకునే కార్యక్రమం.

కాగా ఉత్తరాదిన ఈ ‘రోకా’ ఫంక్షన్‌ సంప్రదాయాన్ని బాగా ఆచరిస్తారు. దీపావళి రోజు కత్రినా–విక్కీ ‘రోకా’ ఫంక్షన్‌ పూర్తి అయిందని తెలుస్తోంది. దర్శకుడు కబీర్‌ ఖాన్‌ ఇంట్లో ఈ వేడుక జరిగిందని… డిసెంబర్‌లో ఈ జంట పెళ్లి పీటల మీద కూర్చుంటారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 7వ తేదీన రాజస్థాన్‌లో ఓ రిసార్ట్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :