‘సూపర్ స్టార్’ ప్రవర్తన నన్ను షాక్ కి గురిచేసింది !

Published on Apr 28, 2019 9:27 pm IST

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ ఓ స్టార్ హీరో గొప్పతనం గురించి చెప్పుకొచ్చింది. ఇంతకీ విషయంలోకి వెళ్తే .. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తోటి నటి నటుల పట్ల ప్రవర్తించే తీరు ఏంటో హుందాగా ఉంటుందని కత్రినా కైఫ్‌ అన్నారు. చాలా సంవత్సరాల క్రితం నేను విజయ్ తో ఓ యాడ్ ఫిల్మ్ చేశాను. ఆయన అందరిని గౌరవించే విధానం, మాట్లాడే తీరు, తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపింది.

కత్రినా కైఫ్‌ మాట్లాడుతూ.. ‘అప్పుడు ఊటీలో షూట్ చేస్తున్నాం. షూట్ అయ్యాక ఫోన్‌ చూసుకుంటూ కూర్చుని ఉన్నాను. నా ముందు ఎవరో వ్యక్తి వచ్చి నుంచున్నాడు. నేను తలెత్తి చూడలేదు. మళ్ళీ కాసేపటికి ఆ వ్యక్తినే వచ్చి నుంచున్నాడు. అసలు ఆ వ్యక్తి ఎవరా అని చూశా. ఆయనే సూపర్ స్టార్ విజయ్‌. గుడ్‌ బై చెప్పడానికి వచ్చి… నేను ఫోన్‌ చూస్తుండటంతో నన్ను డిస్టర్బ్‌ చేయకూడదని అలానే నిల్చుని ఉండి పోయారు. నిజంగా ఆయన అంత వినయంగా నా కోసం ఎదురుచూడటం నన్ను అప్పట్లో షాక్ కు గిరి చేసింది’ అని చెప్పింది కత్రినా.

సంబంధిత సమాచారం :