ఇంకా తీరని ఆ కోరికను బయటపెట్టిన కత్రినా ఖైఫ్

Published on Jun 30, 2019 1:00 am IST

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన కత్రినా వరుసగా సినిమాలు చేస్తూ మంచి ఊపుమీదున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా రంజాన్ కానుకగా విడుదలైన “భారత్” మూవీతో సూపర్ హిట్ అందుకున్న కత్రినా ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న “సూర్యవంశీ” చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఐతే ఈ అమ్మడు ఇంతవరకు హాలీవుడ్ మూవీ ఒక్కటి కూడా చేయలేదు. ఈమె తరువాత స్టార్ హోదా అందుకున్నప్రియాంకా చోప్రా హాలీవుడ్ లో బిజీగా సినిమాలు చేస్తుంటే,దీపికా హాలీవుడ్ సక్సెస్ఫుల్ సిరీస్ అయిన “త్రిపుల్ ఎక్స్” లో నటించారు.

ఐతే తాజా ఈ విషయంపై స్పందించిన కత్రినా ఇంగ్లీష్ చిత్రాలను అమితంగా ఇష్టపడే నేను ఓ ఇంగ్లీష్ మూవీ చేయాలనుకుంటున్నాను అన్నారు. అలా అని పూర్తి స్క్రిప్ట్ చదవకుండా గుడ్డిగా ఒప్పుకోను, నా పాత్ర నాకు నచ్చితే చేస్తాను అన్నారు. ఆవిధంగా హాలీవుడ్ లో ఓ మూవీ చేయాలన్న తన కోరికను బయటపెట్టారు కత్రినా.

సంబంధిత సమాచారం :

More