టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ !

Published on Jun 18, 2019 8:00 pm IST

టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మన తెలుగు అమ్మాయే అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్యా రాజేష్‌ మరియు నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకం పై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి..ది క్రికెటర్‌’. తాజాగా ఈ చిత్రం టీజర్‌ ను మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదగా విడుదల చేశారు.

కాగా టీజర్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సినిమా క్రికెట్‌ నేపథ్యంలో వస్తోన్న విబిన్న కథాంశమని టీజర్ బాగానే హైలెట్ చేసింది. ముఖ్యంగా ఐశ్యర్యా రాజేష్‌… సాధారణ రైతు బిడ్డగా పుట్టి ఒక ఉమెన్‌ క్రికెటర్‌ గా అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూను టీజర్ లో చక్కగా చూపించారు.

లేడీ క్రికెటర్‌ కథాంశంతో వస్తున్న ఈ విభిన్న చిత్రం విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో చేసిన ఈ చిత్రం అన్నివర్గాల ఆడియన్స్‌ని అలరిస్తుందట. క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్‌ చేస్తున్నారు. ఇక తమిళ హీరో శివకార్తికేయన్‌ ఒక స్పెషల్‌ రోల్‌ చేయడం ఈ చిత్రానికి హైలైట్‌.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

X
More