రామ్ చరణ్, బోయపాటి సినిమాలో కౌశల్ ?

Published on Oct 2, 2018 3:59 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం, అజ‌ర్ బైజాన్‌ లో శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తూర్పు ఐరోపాలోని పెద్ద దేశంగా ఉన్న అజ‌ర్ బైజాన్‌ లో మంచి లొకేష‌న్లు ఉన్నాయని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తుంది చిత్రబృందం. కాగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ టైటిల్ ను గెలుచుకొని స్టార్ సెలెబ్రెటీగా మారిపోయిన కౌశల్, రామ్ చరణ్, బోయపాటి చిత్రంలో నటిస్తున్నాడట. ప్రస్తుతం కౌశల్ కు సినిమాల నుండి కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

కాగా, ఈ చిత్రం టైటిల్ విషయంలో.. ‘స్టేట్ రౌడీ’ సినిమా టైటిల్ నే ఈ సినిమాకి కూడా టైటిల్ గా పెట్టనున్నారని గతకొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కూడా పక్కా మాస్ మసాలా అంశాలతో.. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నేలా బోయపాటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :