అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో రచ్చ.. ఆ నిబంధనలు పాటించాలా..?

Allu Arjun

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎందుకు ఏది వైరల్ అవుతుందో ఎవరికీ అర్థంకాదు. అయితే, ఇదే సోషల్ మీడియాలో కొన్నిసార్లు ట్రోల్స్ కూడా చాలా విపరీతంగా జరుగుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరుపై ఓ రచ్చ జరుగుతోంది.

అల్లు అర్జున్‌ను కలవాలంటే ఏకంగా 42 నిబంధనలు ఉంటాయని ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆయనను కలవాలంటే వారి మేనేజర్లు కొన్ని నిబంధనలు చెబుతారని.. వాటిని చాలా స్ట్రిక్ట్‌గా పాటించాలని.. ఆయనను నేరుగా కళ్లలోకి కళ్లు పెట్టి చూడొద్దని, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని.. ఆయనను ఇంటర్వ్యూ చేస్తే ఫోటోలు దిగకూడదని.. ఇలా చాలా నిబంధనలు ఉంటాయని కావేరీ బారువా చెప్పుకొచ్చారు.

దీంతో అల్లు అర్జున్‌ను యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా కావేరీ బారువా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Exit mobile version