
ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రముఖ నటి జయసుధ కుమారుడు శ్రేయాన్ కపూర్ హీరోగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘బస్తీ’. ఈ సినిమా ఆడియో లాంచ్ నిన్నటి సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళవేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ వేడుకలో కెసిఆర్ మాట్లాడుతూ శ్రేయాన్ కపూర్ కి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకోవడమే కాకుండా త్వరలోనే చినీఎ ఇండస్ట్రీ పెద్దలైన దాసరి, రాఘవేంద్రరావు మొదలిన వారితో చర్చించి తెలుగు చలన చిత్ర రంగ డెవలప్ మెంట్ కి కృషి చేస్తానని చెప్పాడు.
అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి ఇండస్ట్రీలో అంతగా సక్సెస్ కాలేకపోయిన ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ కి ఇటీవలే ప్రపోజ్ చేసిన ఫిల్మ్ నగర్ 2 కాలనీలో ఒక రూపాయికే ఇళ్ళ స్థలాలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం అని కెసిఆర్ అనౌన్స్ చేసారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త ఫిల్మ్ స్టూడియోస్ పెట్టి డెవలప్ చెయ్యడానికి మరియు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టె ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని కెసిఆర్ తెలిపాడు. బస్తీ సినిమాతో ప్రగతి చౌరస్య హీరోయిన్ గా పరిచయం కానుంది. వాసు మంతెన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

