కీ తో రానున్న రంగం హీరో !

Published on Apr 2, 2019 4:16 pm IST

యంగ్ హీరో జీవా నటించిన ‘రంగం’ తెలుగులో భారీ విజయాన్ని సాధించి ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఈ చిత్రం తరువాత జీవా నటించిన సినిమాలు తెలుగులో విడుదలైన విజయాన్ని సాదించలేకపోయాయి.

ఇక ఇప్పుడు మరో సినిమా తో తెలుగు ప్రేక్షకులముందుకు రానున్నాడు జీవా. తమిళ భాషలో ఆయన నటించిన తాజా చిత్రం ‘కీ’. సైబర్ క్రైం నేపథ్యంలో కలిస్ తెరకెక్కించిన ఈచిత్రం ఏప్రిల్ 12న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలకానుంది. ఈ సినిమాలో జీవా సరసన నిక్కి గ‌ల్రాని, అనైక సోఠీ హీరోయిన్స్‌గా న‌టించగా రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సుహాసిని కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :