“వీరమల్లు” వసూళ్లపై తక్కువ అంచనాలే బెటర్!

“వీరమల్లు” వసూళ్లపై తక్కువ అంచనాలే బెటర్!

Published on Mar 6, 2025 11:05 AM IST

తెలుగు సినిమా దగ్గర అపారమైన ఆదరణ అలాగే మంచి మార్కెట్ ఉన్నటువంటి హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే పవన్ కళ్యాణ్ ఇపుడు సినిమాలు సహా రాజకీయాలు రెండూ చేస్తున్నారు. అయితే పాలిటిక్స్ లో ఫుల్ టైం బిజీగా ఉన్న సమయంలో కూడా తాను వెంటవెంటనే సినిమాలు కూడా చేయడం జరిగింది.

అయితే పలు రీమేక్ చిత్రాలని చాలా త్వరగానే ఫినిష్ చేసిన పవన్ స్ట్రైట్ సినిమాలు మాత్రం అంత త్వరగా ఫినిష్ చేయకపోవడం గమనార్హం. మెయిన్ గా తన నుంచి మొదటిసారిగా ఒక వారియర్ రోల్ లో హరిహర వీరమల్లు అనే సినిమా అనౌన్స్ అయ్యినపుడు ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. పైగా పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ అయ్యిన ఈ సినిమా అనౌన్స్ అయ్యి ఐదేళ్లు దగ్గరకి వచ్చేస్తుంది.

ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత పవన్ భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో అనే మూడు రీమేక్ సినిమాలు చేసేసారు కానీ వీరమల్లు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. తాను డేట్స్ ఇచ్చినపుడు మేకర్స్ వాడుకోలేకపోయారు అని తాను చెప్పారు కానీ ఆలస్యం మాత్రం చాలా అయ్యింది. అయితే ఇంత ఆలస్యం అవుతూ వస్తున్న సినిమా కోసం అభిమానులే ఇపుడు అంచనాలు తగ్గించేసుకుంటున్నారు.

నిజానికి వారిలో ఎప్పుడో వీరమల్లు పై హైప్ సన్నగిల్లిపోయింది. దీనికి తోడు ఎన్నోసార్లు వాయిదా కూడా పడుతుండడంతో జెనరల్ ఆడియెన్స్ కి కూడా ఎప్పుడో రావాల్సిన సినిమా ఇప్పుడుకి అవుట్ డేటెడ్ అనే భావన కూడా రాకపోదు. సో ఇలా పలు ఫ్యాక్టర్స్ మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపైనే ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇలా వీరమల్లుకి నామ మాత్రం ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ లాంగ్ రన్ లో అన్ని వర్గాల ఆడియెన్స్ ఇన్నేళ్లు ఆలస్యం అవుతూ వస్తున్న సినిమాని చూసేందుకు థియేటర్స్ వరకు తీసుకొస్తుందా అనేదే పెద్ద ప్రశ్న. సో ఈ సినిమా వసూళ్ల పరంగా అభిమానులు తక్కువ అంచనాలు పెట్టుకుంటేనే మంచిది అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు