బాలీవుడ్ లోకి కీర్తి సురేష్ !

Published on Mar 5, 2019 2:22 pm IST

సౌత్ స్టార్ హీరోయిన్ ,మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమాకు సైన్ చేసింది. రీసెంట్ బాలీవుడ్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ ‘బడాహీ హో’ ఫేమ్ అమిత్ షా దర్శకత్వంలో కీర్తి నటించనుంది. ఈ చిత్రంలో ప్రముఖ హీరో అజయ్ దేవగన్ విలన్ పాత్రలో నటించనున్నాడని సమాచారం.

కాగా కీర్తి కి బాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా. మరి ఈసినిమా తరువాత కీర్తి ఆక్కడ బిజీ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈ హీరోయిన్ ప్రస్తుతం మళయాలం లో మరక్కార్ లో నటిస్తుండగా తమిళంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ 166 సినిమాలో నటించనుంది. అలాగే మహానటి తరువాత ఇటీవలే తెలుగులో ఒక చిత్రానికి సైన్ చేసింది. నూతన దర్శకుడు నరేంద్ర ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

సంబంధిత సమాచారం :