‘కీర్తి సురేష్’కి మరో బంఫర్ ఆఫర్ ?

‘కీర్తి సురేష్’కి మరో బంఫర్ ఆఫర్ ?

Published on Jun 2, 2021 8:05 PM IST

మహానటి ఫేమ్ ‘కీర్తి సురేష్’ ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో కూడా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాలో నయనతార, మీనాతో కలిసి కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. తాజాగా విజయ్ తో కూడా కీర్తి సురేష్ నటించే ఛాన్స్ వచ్చింది.

గతంలో కూడా కీర్తి, విజయ్ తో కలిసి నటించింది. విజయ్ తదుపరి చిత్రంలో కీర్తి సురేష్ నటించడానికి అంగీకరించిందని తెలుస్తోంది. ఐతే, విజయ్ నెక్స్ట్ మూవీ లోకేష్ కనగరాజ్ తో ఉంటుందా? లేక వంశీ పైడిపల్లితోనా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ విజయ్ నెక్స్ట్ సినిమాలో ఆమె ఫిక్స్ వస్తున్నాయి. సర్కారులో మహేష్ సరసన, తమిళంలో విజయ్ సరసన ఒకేసారి కీర్తి నటిస్తే.. ఆమె స్టార్ డమ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు