ఎన్టీఆర్ సినిమాలో కీర్తి సురేష్ ఉందట ?

Published on Jul 16, 2018 8:58 am IST

దర్శకుడు క్రిష్ నటరత్న ఎన్టీఆర్ జీవితకథను తెరకెక్కించబోతున్న విషయం తేలింసిదే. బాలకృష్ణ ప్రధానపాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్ లో టాకీ పార్ట్ పూర్తి కానుంది. ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే విద్యాబాలన్ ను, రానాను, సచిన్ కేడెకర్ ను, మోహన్ బాబును ఎంపిక చేశారు. అలాగే మహానటి సావిత్రికి సంబంధించిన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, మహానటి పాత్రలో కీర్తి సురేష్ మరోసారి కనిపించనుందని గతంలోనే వార్తలు వచ్చాయి.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మహానటి పాత్రలో కీర్తి సురేష్ మరోసారి నటించనున్నట్లు తెలుస్తోంది. నందమూరి తారకరామారావుగారి పక్కన మహానటి సావిత్రిగారు చాలా సినిమాల్లో కలిసి నటించారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా బాలకృష్ణే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More