దసరా ను టార్గెట్ చేస్తున్న కీర్తి !

Published on Mar 30, 2019 4:07 pm IST

రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి తరువాత ప్రస్తుతం తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం లో నటిస్తుంది. నరేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ , నరేష్ , కమల్ కామరాజ్ ,నదియా, భాను శ్రీ మెహతా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క షూటింగ్ 50లక్షల తో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తరువాత చిత్ర బృందం విదేశాలకు వెళ్లనుంది. సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ అంతా అక్కడే జరుగనుంది.

ఇక ఈ చిత్రాన్ని విజయదశమి సీజన్లో విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈచిత్రం తెలుగు తోపాటు తమిళంలోనూ విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :