పెళ్లి వార్లలపై కీర్తి సురేష్ ఏమందంటే..

Published on May 21, 2021 6:30 pm IST

హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల మీద రూమర్స్ ఎప్పుడూ కామనే. అదే లైమ్ లైట్లో ఉన్న హీరోయిన్లకు సంబంధించిన ఏ విషయమైనా హాట్ టాపిక్ అయిపోతుంది. ముఖ్యంగా వారి పెళ్లి చర్చ అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. అందుకే వారి పెళ్లి మీద ఎప్పుడూ రూమర్స్ రెడీగా ఉంటాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ మీద ఇలాంటి రూమర్లే వస్తున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా కీర్తి సురేష్ వివాహానికి రెడీ అయిందని, చెన్నైకు చెందిన ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

మొదట్లో కీర్తి వీటిని లైట్ తీసుకున్నా ఇప్పుడు స్పందించక తప్పలేదు. అసలు తనకు పెళ్లి ఆలోచనే లేదని, తన దృష్టి మొత్తం సినిమాల మీదే ఉందని, ముందు పని ఆతర్వాతే ఏదైనా అని తేల్చి చెప్పిన కీర్తి తనకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే, అబ్బాయిని ఫైనల్ చేసుకుంటే ఆదరికంటే ముందే ఆ వార్తను బయటకు చెబుతానని అంటోంది. ఇప్పుడే కాదు గతంలో కూడ కీర్తి సురేష్ తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ తో ప్రేమలో ఉన్నట్టు పుకార్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :