స్టార్ హీరో సరసన మరో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్ !

3rd, January 2018 - 02:13:21 PM

తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది హీరోయిన్ కీర్తి సురేష్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘అజ్ఞాతవాసి’, సూర్యతో చేసిన ‘గ్యాంగ్’ సినిమాలు ఈ నెలలోనే రిలీజుకు సిద్ధంగా ఉండగా మరొక భారీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకుంది ఈమె.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఇలయదళపతి విజయ్, మురుగదాస్ ల చిత్రంలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఖాయం చేశారు. గతంలో కీర్తి సురేష్ విజయ్ తో కలిసి ‘భైరవ’ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ గ్రూప్స్ నిర్మిస్తోంది.