మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కీర్తి సురేష్ !

Published on Mar 6, 2019 10:00 pm IST

రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ వరుస సినిమాలకు కమిట్ అవుతుంది. అందులో భాగంగా ఇటీవల నరేంద్ర దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సైన్ చేసిన కీర్తి కొద్దీ రోజుల క్రితం బాలీవుడ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కనున్న ఈచిత్రం లో కీర్తి, అజయ్ దేవగన్ తో కలిసి నటించనుంది. అమిత్ షా ఈచిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.

ఇక తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకి ఓకే చెప్పింది కీర్తి. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ,’హైదరాబాద్ బ్లూస్’ ఫేమ్ నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్ అలాగే ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ జాయింట్ గా ఈచిత్రాన్ని నిర్మించనున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :