ఈ ఓటిటిలోకి వచ్చేసిన కీర్తి సురేష్ లేటెస్ట్ ప్లాప్!

ఈ ఓటిటిలోకి వచ్చేసిన కీర్తి సురేష్ లేటెస్ట్ ప్లాప్!

Published on Dec 26, 2025 8:06 AM IST

Revolver Rita

యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గానే కాకుండా ఆమె లీడ్ రోల్ లో కూడా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల్లో తన నుంచి ఇటీవల వచ్చిన చిత్రమే “రివాల్వర్ రీటా”. ఓ క్రైమ్ కామెడీగా వచ్చిన ఈ సినిమా కూడా కీర్తి సురేష్ కి హిట్ గా నిలవలేకపోయింది. నిజానికి ఎపుడో విడుదల కావాల్సిన ఈ సినిమాని మేకర్స్ గత నెలాఖరున విడుదల అయ్యింది.

ఇందులో కూడా పెద్దగా కంటెంట్ లేకపోవడం, పైగా బాగా ఆలస్యం అయ్యిన ప్రాజెక్ట్ కావడంతో ఆడియెన్స్ మొహం చాటేశారు. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఇవాళ్టి నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఇవాళ్టి నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమాని కూడా చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఇక ఈ సినిమాకి జేకే చంద్రు దర్శకత్వం వహించగా సదన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు