కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ లేటెస్ట్ అప్డేట్ !

Published on Apr 27, 2019 3:02 pm IST

సర్కార్ తరువాత వరుస సినిమాలకు కమిట్ అవుతూ సౌత్ లో బిజీ అయిపొయింది మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. అందులో భాగంగా ప్రస్తుతంతెలుగు , మలయాళం , తమిళ చిత్రాల్లో నటిస్తుంది. ఇక ఇటీవల ఈ హీరోయిన్ బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిన విషయం తెలిసిందే.

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో స్టార్ హీరో అజయ్ దేవగన్ కు జోడిగా నటించనుంది కీర్తి. మాజీ ఇండియన్ జాతీయ ఫుట్ బాల్ టీం కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘బడాహీ హో’ ఫేమ్ అమిత్ షా దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ జూలై లో ప్రారంభమై నవంబర్ లో ఎండ్ కానుంది. ఫ్రెష్ లైమ్ ఫిలిమ్స్ తో కలిసి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈచిత్రాన్ని నిర్మించనునున్నాడు.

సంబంధిత సమాచారం :