రిలీజ్ కి రెడీ అంటున్న కీర్తి “గుడ్ లక్ సఖి”.!

Published on Oct 17, 2021 5:00 pm IST

ప్రస్తుత సౌత్ ఇండియన్ సినిమా దగ్గర పలు ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ గా నిలిచే కొంతమంది అతి తక్కువ మంది హీరోయిన్స్ లో కీర్తీ సురేష్ పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. తన “మహానటి” సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న కీర్తీ అక్కడ నుంచి తనదైన నటనతో ఆసక్తికర పాత్రలతో సినిమాలు చేస్తూ వెళ్తుంది.

ఇక ఈరోజు తన పుట్టినరోజు కావడంతో అనేకమంది సినీ తారలు ఆమెకి విషెష్ చెబుతుండగా తాను నటించిన మరో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రం “గుడ్ లక్ సఖి” నుంచి చిత్ర యూనిట్ ఓ క్లారిటీ కూడా వచ్చింది. ఎప్పుడు రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం అలా వాయిదా పడుతూ వస్తుంది.

ఇక ఎట్టకేలకు ఈ సినిమాని వచ్చే నవంబర్ లో రిలీజ్ కి ఫిక్స్ చేసినట్టుగా మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించగా జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రెజెంట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :