ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన కీర్తీ సురేష్ “గుడ్ లక్ సఖి”.!

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన కీర్తీ సురేష్ “గుడ్ లక్ సఖి”.!

Published on Feb 13, 2022 6:02 PM IST

ఈ ఏడాది థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన పలు చిత్రాల్లో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం “గుడ్ లక్ సఖి” కూడా ఒకటి. తన కెరీర్ లో ఎప్పుడో స్టార్ట్ చేసిన ఈ సినిమా పలు కారణాల చేత ఆగుతూ ఫైనల్ గా థియేటర్స్ లోనే రిలీజ్ అయ్యింది. దర్శకుడు నగేష్ కుకునూర్ తెరకెక్కించిన ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. కానీ అనుకున్న అంచనాలు అయితే రీచ్ కాలేకపోయింది.

మరి జస్ట్ గత కొన్ని రోజులు కితమే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటిటి యాప్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు ఈ చిత్రం అందుబాటులో ఉంది. మరి అప్పుడు మిస్ అయ్యినవారు చూడాలి అనుకునే వారు ఇందులో చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో మేల్ లీడ్ లో నటుడు ఆది పినిశెట్టి నటించగా జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు