స్పోర్ట్స్ డ్రామా లో కీర్తి సురేష్ !

Published on Mar 6, 2019 9:00 am IST

మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ హిందీ సినిమాలో నటించనుందని తెలిసిందే. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉండనుందట. ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ లైఫ్ స్టోరీ ను బేస్ చేసుకొని తెరకెక్కనుందని సమాచారం. పీరియాడికల్ డ్రామా గా తెరకెక్కనున్న ఈచిత్రంలో అజయ్ దేవగన్ కథానాయకుడిగా నటించనున్నారు. ‘బడాహీ హో’ ఫేమ్ అమిత్ షా డైరెక్ట్ చేయనున్నఈ చిత్రం జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఫ్రెష్ లైమ్ ఫిలిమ్స్ తో కలిసి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈచిత్రాన్ని నిర్మించనునున్నాడు. ఇక కీర్తి కి బాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా. మరి ఈ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ఆక్కడ బిజీ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More