కీర్తి సురేష్ – ‘118’ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో.. !

Published on Mar 7, 2019 8:25 pm IST

సినీమాల్లో హీరోయిన్ల పాత్రకు ప్రాధాన్యతే లేకుండా పోతుందని చాలా కాలంగా విమర్శలు వింటూనే ఉన్నాం. అయితే అప్పుడప్పుడు అరుంధతి, మహానటి లాంటి సినిమాలు హీరోయిన్లలోని నటన చాతుర్యాన్ని బయటపెడుతుంటాయి. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కీర్తి సురేష్.. మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో నరేంద్ర అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం మార్చి 15 నుంచి షూటింగ్ మొదలవ్వనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లోని సెవెన్ ఎకరాస్ లో నిర్మిస్తోన్న ఓ భారీ సెట్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు.

అలాగే ఏప్రిల్ మొదటి వారంలో ఓ పాటను తెరకెక్కిస్తారట. ఇక మేలో కీలక షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్లనుంది చిత్రబృందం.. అక్కడ జూన్ వరకు షూటింగ్ కొనసాగనుంది. అయితే మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రాకంగా దాడుల జరుగుతాయి. ఆ దాడులని ఈ చిత్రంలో విశ్లేషాత్మకంగా చూపించనున్నారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :