ఆమె ఎనలేని ‘కీర్తి’ గడించింది…!

Published on Aug 17, 2019 7:21 am IST

నటి కీర్తి సురేష్ నిన్న ప్రకటించిన సైమా అవార్డ్స్ లో మహానటి చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లోకూడా ఆమె ఉత్తమనటి అవార్డు గెలుపొందారు. దీనితో స్వల్ప వ్యవధిలో రెండు అవార్డ్స్ సొంత చేసుకున్న కీర్తి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క సినిమాతో కీర్తి సురేష్ ఎనలేని కీర్తి గడించింది. నటి సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేశారు. కొన్ని సన్నివేశాలలో నిజంగా సావిత్రి తన పాత్రలో తానే నటించారా… అన్నట్లుగా కీర్తి చేయడం జరిగింది. విడుదలకు ముందు సావిత్రి పాత్రలో కీర్తి నా… అని పెదవి విరిచినవారు, సినిమా చూశాక ఆమె తప్ప మరొకరు చేయలేరు అన్న అభిప్రాయానికి వచ్చారు. ఐతే మహానటి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న కీర్తికి ఆ స్థాయి అవకాశాలు మాత్రం రాలేదు.
దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రియాంక దత్, స్వప్నా దత్ నిర్మించగా, రాజేంద్ర ప్రసాద్, సమంత, విజయ్ దేవరకొండ, షాలిని పాండే ఇతర కీలకపాత్రలలో నటించారు.

సంబంధిత సమాచారం :