ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్ పట్టేసిన కీర్తి సురేష్.

Published on Jun 3, 2019 5:57 pm IST

కీర్తి సురేష్ తెలుగు తెరపై కనిపించి చాలా రోజులవుతుంది. 2018 లో వచ్చిన మహానటి, అజ్ఞాతవాసి సినిమాల తర్వాత ఆమె తెలుగు సినిమాలో నటించింది లేదు. సర్కార్,పందెంకోడి -2 వంటి అనువాద చిత్రాలతో మాత్రం ఆమె తెలుగు తెరపై సందడి చేసింది. ఏకంగా రాజమౌళి “ఆర్ ఆర్ ఆర్” లో అవకాశం దక్కించుకున్నారు అని పుకార్లు చెలరేగాయి కానీ అందులో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది. మహానటి ప్రభావం వల్లనేమో నాయకా ప్రాధాన్యం సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా నితిన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్లో కథానాయికగా కీర్తి సురేశ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న ‘భీష్మ’ షూటింగ్ దశలో ఉంది.ఈ మూవీ ని ఈ ఏడాది డిసెంబర్లో విడుదలయ్యే అవకాశం కలదు. ఆ తరువాత కీర్తి ,నితిన్ ల మూవీ సెట్స్ పైకెళ్లే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

More