11 వసారి 100కోట్ల క్లబ్ లో చేరిన స్టార్ హీరో !

Published on Mar 29, 2019 8:10 am IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కేసరి’ తో 11 వసారి 100 కోట్ల క్లబ్ లో చేరి కొత్త రికార్డు సృష్టించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. కేవలం 7రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల ను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది. అలాగే ఈ చిత్రం ఈ ఏడాది తక్కువ సమయంలో 100 కోట్లను రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

1897 లో జరిగిన సారాగడి యుద్ధం ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రంలో పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటించగా అనురాగ్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :

More