పూరి తనయుడి కొత్త చిత్రంలో బాలీవుడ్ నటి !

పూరి తనయుడి కొత్త చిత్రంలో బాలీవుడ్ నటి !

Published on Mar 15, 2019 12:35 AM IST

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్. నూతన దర్శకుడు అనిల్ పడూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పూరీనే స్టోరీ , స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక తాజాగా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ నటి మందిర బేడీ ని తీసుకున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు