టీం “మేజర్” నుంచి వారికి కీలక అనౌన్సమెంట్.!

Published on Jun 14, 2022 11:00 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మేజర్”. రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని శేష్ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ ఎమోషనల్ హిట్ గా నిలిచింది.

అయితే ఈ చిత్రం ఇప్పటికీ మంచి రన్ ని కొనసాగిస్తుండగా టీం మేజర్ తరపున అడివి శేష్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించాడు. ఈరోజు స్కూల్స్ మరియు పిల్లల కోసం ఒక స్పెషల్ అనౌన్సమెంట్ ని అందిస్తున్నట్టుగా శేష్ తెలిపాడు. మరి ఈ అప్డేట్ ఏంటి అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకల సంగీతం అందించగా మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ ఇండియా, ఏ + ఎస్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :