
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ రేపటి (జనవరి 20) నుండి హైదరాబాద్ లో మొదలవుతుంది. సిటీలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది.
అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించనున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సమంత, నిత్య మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

