సంక్రాంతి బరిలో కెజిఎఫ్2..?

Published on Aug 5, 2020 7:21 am IST

దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న చిత్రాలలో కెజిఎఫ్ 2 ఒకటి. దీని మొదటి పార్ట్ భారీ హిట్ కొట్టిన నేపథ్యంలో సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనితో దర్శకనిర్మాతలు సైతం మొదటి పార్ట్ కి మించి భారీ హంగులతో కెజిఎఫ్ 2 సిద్ధం చేస్తున్నారు. ఇక లాక్ డౌన్ ముందు వరకు ఈ మూవీ షూటింగ్ నిరవధికంగా సాగింది. కేవలం 15రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం అందుతుంది.

కాగా కెజిఎఫ్ 2 విడుదల తేదీ మారినట్లు సమాచారం అందుతుంది. కెజిఎఫ్2 విడుదల తేదీ అక్టోబర్ 23గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు థియేటర్స్ అప్పటికి తిరిగి ప్రారంభం అవుతాయనే గ్యారంటీ లేదు. దీనితో కెజిఎఫ్ 2 విడుదల సంక్రాంతికి మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెలలో షూటింగ్ మొదలుపెట్టి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి 2021సంక్రాంతికి విడుదల చేయాలన్నది ఆలోచనగా తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More