‘కెజిఎఫ్-2’ టీజర్ మరో సరికొత్త రికార్డ్

Published on Jun 1, 2021 8:15 pm IST

యాక్షన్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కెజిఎఫ్ 2’. చిత్రీకరణ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ముందుగా అనుకున్నట్టే జూలై 16వ తేదీన సినిమా రిలీజ్ ఉంటుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ విడుదలై 5 నెలలు కావొస్తున్నా ఇప్పటికీ రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. టీజర్ 24 గంటలు కూడ గడవకముందే 69 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు మొత్తంగా 188 మిలియన్ల వ్యూస్, 8.3 మిలియన్ లైక్స్ తెచ్చుకుంది.

అంతేకాదు తాజాగా టీజర్ కామెంట్స్ సైతం 1 మిలియన్ కామెంట్స్ తెచ్చుకుంది. ఇప్పటివరకు ఏ టీజర్ కూడ ఇన్ని కామెంట్స్ పొందింది లేదు. దీన్నిబట్టి సినిమా పట్ల ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కేవలం టీజరే ఈ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే ఇక ట్రైలర్ ఏ లెవల్లో భీభత్సం సృష్టిస్తుందో చూడాలి. ఇందులో యష్ సరసన కథానాయికగా శ్రీనిధి శెట్టి నటించగా రవీనా టాండన్ రమికాసేన్ పాత్రలో సంజయ్ దత్ అధీరా పాత్రలో కనిపిస్తున్నారు. తెలుగు నటుడు రావు రమేష్ సైతం ఇందులో ఒక కీ రోల్ చేయనున్నారు. కన్నడం, తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడ చిత్రం రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :