“కేజీయఫ్ 2” బిగ్గెస్ ఓటిటి డీల్..ఎంత మొత్తంలో అంటే.!

Published on Aug 12, 2021 3:43 pm IST


ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలతో రెడీగా ఉన్న పాన్ ఇండియన్ చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. చాప్టర్ 1 అతి పెద్ద హిట్ కావడంతో చాప్టర్ 2 అంతకి మించిన స్థాయిలో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కానీ కరోనా మూలాన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. మరి ఇదే క్రమంలో ఈ చిత్రానికి కూడా భారీ ఓటిటి ఆఫర్స్ ఎప్పుడు నుంచో వస్తుండగా లేటెస్ట్ గా మరో పెద్ద ఓటిటి ఆఫర్ డైరెక్ట్ రిలీజ్ కి గాను వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఆ మొత్తం ఎంతంటే 250 కోట్లకి పైగా ఆఫర్ ఇచ్చారట. కానీ మేకర్స్ మాత్రం అందుకు నిర్మొహమాటంగా నో చెప్పేసినట్టు తెలుస్తుంది.

అయితే ఇందులో ఎంతమేర నిజం ఉందో కానీ ఇంతమొత్తం తక్కువే కావచ్చని చెప్పాలి. ఈ చిత్రానికి సరైన టైం లో రిలీజ్ చేస్తే ఓవరాల్ ఇండియాలో డే 1 ఒక్కదానికే రాబట్టేయగలదు. అందుచేత ఇది చాలా తక్కువ అనవసరమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్ ప్రకాష్ రాజ్ తదితరులు నటించగా హోంబలే పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :