రిలీజ్ కి ముందే వండర్స్ సెట్ చేస్తున్న “కేజీయఫ్ 2”.!

Published on Apr 24, 2021 12:00 pm IST

ఇప్పుడు మన ఇండియన్ సినిమా దగ్గర ఎనలేని క్రేజ్ ఉన్న పలు సాలిడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో తప్పకుండా ముందు వరుసలో నిలిచే చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కోసం ఇండియా వైడ్ ప్రతీ ఇండస్ట్రీలో అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే మరి మోస్ట్ అవైటెడ్ సినిమాగా నిలిచిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో అన్న దానిపై మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా ఇంకాఆ రిలీజ్ కు చాలా టైం ఉండగానే బుక్ మై షో లో 3 లక్షల మందికి పైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

దీనితో ఈ చిత్రం ఇండియా లోనే ఏ సినిమాకు రాని విధంగా రికార్డ్ సెట్ చేసింది. దీనితో ఈ సినిమా పట్ల మూవీ లవర్స్ ఏ స్థాయిలో ఆసక్తి కనబరుస్తున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా నటించగా ప్రకాష్ రారాజే, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :