వరల్డ్స్ ఫాస్టెస్ట్ రికార్డ్ ను సెట్ చేసిన “కేజీయఫ్ 2” టీజర్!

వరల్డ్స్ ఫాస్టెస్ట్ రికార్డ్ ను సెట్ చేసిన “కేజీయఫ్ 2” టీజర్!

Published on Jan 8, 2021 10:04 AM IST

yash2

ఇప్పుడు ఇండియన్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ పవర్ ఫుల్ టీజర్ “కేజీయఫ్ చాప్టర్ 2” టీజర్. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇక అలాగే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారీ చిత్రం తాలూకా టీజర్ అనుకున్న సమయానికి ముందే వచ్చినా సరే యూట్యూబ్ లోని ప్రపంచ స్థాయి రికార్డుల తుక్కు రేగ్గొడుతూ దూసుకుపోతుంది.

యూట్యూబ్ లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ రికార్డు కొల్లగొట్టిన ఈ టీజర్ ఇప్పుడు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ 2 మిలియన్ లైక్డ్ టీజర్ రికార్డును సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సెన్సేషనల్ ఫీట్ ను ఈ టీజర్ కేవలం పదిన్నర గంటల్లోనే ఈ టీజర్ నెలకొల్పి దుమ్ము లేపేసింది. హాలీవుడ్ లెవెల్ టేకింగ్ అండ్ విజువల్స్ తో మాస్ యుఫోరియా సెట్ చేసిన ఈ మైండ్ బ్లోయింగ్ టీజర్ ఇక ముందు ఎలాంటి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి. అలాగే 24 గంటలు అయ్యేలోపు 3 మిలియన్ మార్కును కూడా సెట్ చేస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు