అక్కడ ఇప్పటకీ “కేజీయఫ్ 2” కే మంచి క్రేజ్!

Published on Nov 24, 2020 10:00 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ యాక్షన్ పీరియాడిక్ చిత్రం “కేజీయఫ్” ఏ రేంజ్ లో సెన్సేషన్ నమోదు చేసుకుందో తెలిసిందే. ఒక్క కన్నడ లోనే కాకుండా విడుదల కాబడ్డ అన్ని భాషల్లోనూ భారీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం తాలూకా సీక్వెల్ కోసమే అన్ని భాషల సినీ ప్రేమికులు కూడా ఎదురు చూస్తున్నారు.

అయితే హిందీలో మాత్రం ఈ చిత్రం కోసం అక్కడి జనం గట్టిగానే ఎదురు చూస్తున్నారు. ఇంకా పలు హిందీ మరియు పాన్ ఇండియన్ సినిమాలు కూడా ఉన్నప్పటికీ కూడా హిందీ ప్రేక్షకుల పల్స్ మాత్రం కేజీయఫ్ చాప్టర్ కోసమే ఎక్కువగా ఎదురు చూస్తున్నట్టు ఇపుడు తెలుస్తుంది.ఇప్పటికీ ఇంకా టీజర్ కూడా విడుదల కాని ఈ సినిమాపై అక్కడ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ ను ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :