వేరే లెవెల్లో “కేజీయఫ్ 2” విడుదల.?

Published on Jan 21, 2021 7:04 am IST

ఇప్పుడు మన దేశ వ్యాప్తంగా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అతి కొద్ది పాన్ ఇండియన్ సినిమాల్లో కన్నడ స్టార్ హీరో యష్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. లేటెస్ట్ గా టీజర్ తో ఎంతటి సెన్సేషన్ ను ఇది నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

దీనితో మరింత స్థాయిలో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం విడుదల మరో స్థాయిలో అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఎలాగో పాన్ ఇండియన్ వైడ్ భారీ విడుదల కానున్న సంగతి తెలిసిందే. కానీ మేకర్స్ నుంచి లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేస్తారట.

అంతర్జాతీయ స్థాయిలో మరికొన్ని భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అంతేకాదు అందులో ఆంగ్ల భాషలో కూడ అనువాదం ఉందని టాక్. మొత్తానికి మాత్రం సాలిడ్ ప్లానింగ్ తో విడుదలకి రెడి అవుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడలి.

సంబంధిత సమాచారం :

More