`కేజీఎఫ్’లో ‘సంజయ్ దత్’ హైలెట్ అట !

`కేజీఎఫ్’లో ‘సంజయ్ దత్’ హైలెట్ అట !

Published on Dec 19, 2019 9:33 AM IST

KGF2

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది ఈ చిత్రం. కాగా ఈ సినిమాలో ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరా కోసం బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో హైప్ మరింత పెరిగింది. ప్రశాంత్ నీల్ సినిమాను పార్ట్ 1 కంటే భీభత్సమైన రీతిలో తెరకెక్కిస్తున్నాడని అర్థమైంది. ఇక సంజయ్ దత్ ఇటీవలే హైదరాబాద్లో జరిగిన చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆ షెడ్యూల్ లో తెరకెక్కించిన సీన్స్ అద్భుతంగా వచ్చాయని.. సినిమా మొత్తంలోనే అధీరా క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందని.. ‘యశ్’ తరువాత సంజయ్ దత్ నే హైలెట్ అవుతాడట. హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.

కన్నడం, హిందీ, తెలుగు, త‌మిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. అందుకే యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ సినిమా కోసం అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులు కూడా గట్టిగానే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ అయితే ఈ సినిమా పై పెట్టుకున్న అంచనాలు అన్ని ఇన్ని కావు. వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో సినిమాని రిలీజ్‌ చేయ‌నున్నారు. ఈ సీక్వెల్ లో తొలి భాగాన్ని మించి భారీ యాక్ష‌న్ ని చూపించ‌నున్నారు. కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్ గ‌నుల‌ పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీక‌ర మాఫియాని ప‌తాక స్థాయిలో చూపించ‌బోతున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు