‘కె.జి.ఎఫ్’ దర్శకుడి నుండి మరొక సినిమా

‘కె.జి.ఎఫ్’ దర్శకుడి నుండి మరొక సినిమా

Published on Dec 18, 2020 1:00 AM IST

Bagheera

‘కె.జి.ఎఫ్’ చిత్రంతో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. యాక్షన్ సినిమాలను ఇది వరకు చూడని ఎలివేషన్లతో తెరకెక్కించగల దర్శకుడిగా పేరుపడ్డారు. ప్రస్తుతం ఈయన చేస్తున్న ‘కె.జి.ఎఫ్ 2’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలకానుంది. ఇలా సినిమా పూర్తవుతోంది అనగానే ప్రభాస్ హీరోగా ‘సలార్’ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఉండనుంది. ఈ ప్రాజెక్ట్ మీద దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు తారాస్థాయి అంచనాలతో ఉన్నారు.

ఇదిలా ఉండగా కొత్తగా ‘బాఘీర’ అనే ఇంకో సినిమాను ప్రకటించారు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమాకు ఈయన దర్శకుడు కాదు. రచయిత. కన్నడ స్టార్ హీరో శ్రీమురళి ఇందులో హీరో. డాక్టర్ సూరి దర్శకుడు. ఈ సినిమా కథను ప్రశాంత్ నీల్ అందించడం జరిగింది. దీన్ని కూడ హోంబలే ఫిలింస్ నిర్మించనుంది. ఈ చిత్రం మీద కన్నడ ప్రేక్షకులు క్రేజీగా ఉన్నారు. గతంలో ప్రశాంత్ నీల్ శ్రీమురళి హీరోగా ‘ఉగ్రం’ అనే సినిమాను తీయగా ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. అదే శ్రీమురళికి స్టార్ హీరో స్టేటస్ అందించింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వారి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘బఘీర’ మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు