సుధీర్ బాబు టీం కి ‘కేజీయఫ్’ దర్శకుడి ప్రశంసలు.!

Published on Aug 28, 2021 2:00 pm IST


టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా మరో యంగ్ అండ్ టాలెంటెడ్ నటి ఆనంది హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. నిన్ననే థియేట్రికల్ గా రిలీజ్ కాబడిన ఈ చిత్రం నెలకొల్పుకున్న అంచనాలను అన్నీ రీచ్ అయ్యే టాక్ ను తెచ్చుకొని దూసుకెళ్తుంది. అలాగే ఒక్క సినీ వర్గాల్లోనే కాకుండా స్టార్ నటులు దర్శకులు నుంచి ప్రశంసల జల్లు కురుస్తుంది.

రీసెంట్ గానే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతీ డీటెయిల్ ని చెప్పి చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పగా ఇప్పుడు సెన్సేషనల్ ఫీల్మ్ మేకర్స్ కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రశంసలు కురిపించారు. నా ఫ్రెండ్ ఈ చిత్ర నిర్మాత విజయ్ చిల్లా తో సినిమా కోసం గొప్ప విషయాలు వింటున్నాని దర్శకుడు కరుణ కుమార్ కి అలాగే శ్రీదేవి సోడా సెంటర్ చిత్ర యూనిట్ అందరికీ కూడా కంగ్రాట్స్ అని తెలిపారు. అలాగే సుధీర్ బాబు అయితే ఫాబ్యులస్ గా కనిపిస్తున్నాడని నీల్ తెలిపారు.

సంబంధిత సమాచారం :