`కేజీఎఫ్’ అప్ డేట్ కూడా ఇస్తారా ?

`కేజీఎఫ్’ అప్ డేట్ కూడా ఇస్తారా ?

Published on Dec 1, 2020 1:00 AM IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా సీక్వెల్ కూడా ఒకటి. కాగా `కేజీఎఫ్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలింస్ సంస్థ మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. డిసెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటల 9 నిముషాలకు కొత్త సినిమా నుండి బిగ్ ఎనౌన్స్ మెంట్ రానుంది. అయితే `కేజీఎఫ్’ టీజర్ ట్రైలర్ బిగ్ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి డిసెంబర్ 2న `కేజీఎఫ్ అప్ డేట్ ఇస్తే బాగుంటుంది.

ఇక ఈ సినిమా మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ సినిమా కోసం అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులు కూడా గట్టిగానే ఎదురు చూస్తున్నారు. మాస్ ఆడియెన్స్ అయితే ఈ సినిమా పై పెట్టుకున్న అంచనాలు అన్ని ఇన్ని కావు. హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది.

కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్ గ‌నుల‌పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీక‌ర మాఫియాని ప‌తాక స్థాయిలో చూపించ‌బోతున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు