కమల్ సినిమా కోసం “కేజీయఫ్” స్టంట్ మాస్టర్స్.!

Published on Jun 13, 2021 10:30 am IST

విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్స్ లో కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కిస్తున్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్” కూడా ఒకటి. ఆ మధ్య వచ్చిన టీజర్ తో మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది.

ఈ చిత్రానికి గాను భారీ చిత్రం “కేజీయఫ్” స్టంట్ మాస్టర్స్ కాంబో అంబు, అరివి బ్రదర్స్ యాక్షన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేయనున్నారని దర్శకుడు తెలిపాడు. దీనితో ఇక ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లు ఏ రేంజ్ లో ఉంటాయో మనం అర్ధం చేసుకోవచ్చు.

వీరి కాంబో ఇప్పటికే మన దగ్గర కూడా మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ చిత్రం “ఖిలాడి”లో కూడా ఒక అదిరే యాక్షన్ ఎపిసోడ్ ను కూడా ప్లాన్ చేసారు. మరి కమల్ చిత్రానికి తనే నిర్మాణం వహిస్తుండగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :