బాలీవుడ్ లో మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేసిన “కేజీఎఫ్2”

Published on May 20, 2022 8:00 pm IST

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా కేజీఎఫ్2. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు లను క్రియేట్ చేసి, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

ఈ చిత్రం ఇప్పటి వరకు 430 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. హిందీ చిత్రాలకు కూడా అందని రికార్డ్ ను క్రియేట్ చేసి బాహుబలి 2 తర్వాత చిత్రం గా నిలిచింది. త్వరలో ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ను అలరించడానికి సిద్దం అవుతుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :