భారత్ లో “కేజీఎఫ్2” సెన్సేషన్…బాహుబలి 2 తర్వాతి చిత్రం గా రికార్డ్!

Published on May 15, 2022 8:00 pm IST

రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన శాండల్‌వుడ్ మాగ్నమ్ ఓపస్ ఈరోజు భారతీయ సినిమా చరిత్రలో అరుదైన ఘనతను సృష్టించింది. పీరియడ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయల కి పైగా వసూళ్లు చేసిందనేది సంచలన వార్త.

ఒక్క భారతదేశంలోనే 1000 కోట్ల రూపాయల ను సాధించి దూసుకు పోతుంది. బాహుబలి 2 తర్వాత రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కేజీఎఫ్ 2 నిలిచింది. బాహుబలి 2 తర్వాత విడుదలైన ఏ భారీ చిత్రం కూడా ఈ అద్భుతమైన మైలురాయిని దాటలేదు. శ్రీనిధి శెట్టి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్ మరియు సంజయ్ దత్ ఈ బ్లాక్ బస్టర్ మూవీలో కీలక పాత్రలు పోషించారు, దీనిని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :