‘ఖైదీ నంబర్ 150’ డిస్క్‌లు యూఎస్‌కు చేరిపోయాయ్!
Published on Jan 9, 2017 8:32 am IST

khaidi
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌ పరంగా ఊహించని స్థాయి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధిస్తుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. జనవరి 11న సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా జనవరి 10వ తేదీ అర్థరాత్రి నుంచే సందడి మొదలుపెట్టనుంది. యూఎస్‍లో ప్రీమియర్స్‌తో ఖైదీ సందడి మొదలుకానుంది.

ఇప్పటికే యూఎస్‌లోని చాలా ప్రాంతాలకు ఖైదీ నంబర్ 150 డిస్క్స్ చేరిపోయాయి. టెక్సాస్‌లోని డల్లాస్‌కు డిస్క్స్ చేరగా, అక్కడి మెగాస్టార్ వీరాభిమానులు చిట్టి ముత్యాల, సురేష్ లింగినేని, భవిరెడ్డి శ్రీనివాస్, శ్రీధర్ లింగినేని, ప్రసాద్ నలరాజాల, సురేష్ వెజ్జు తదితరులు ఖైదీ నెంబర్ 150 డిస్క్‌లను ఓపెన్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చిరంజీవికి ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు సినిమాకు మంచి మార్కెట్‌గా అవతరించిన యూఎస్‌లో ఖైదీ రికార్డు స్థాయిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. సుమారు 210 స్క్రీన్స్‌లో అక్కడ ఖైదీ ప్రదర్శితం కానుండడం విశేషంగా చెప్పుకోవాలి. దీంతో భారీ ఓపెనింగ్స్ ఖాయం అని టీమ్ భావిస్తోంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించగా, చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటించారు.

 
Like us on Facebook